వెయిట్ లాస్ అవ్వాలా.. బ్రేక్ ఫాస్ట్ లో ఇవి ట్రే చేయండి..!

-

అధిక బరువు ఉన్నవారు.. చాలామంది..టిఫెన్ చేయడాన్ని స్కిప్ చేస్తారు. ఒకేసారి లంచ్ చేయొచ్చు.. బరువు తగ్గొచ్చు అనుకుంటారు.. కానీ.. అప్పటివరకూ.. కడుపు ఖాళీగా ఉండేసరికి.. లంచ్ ఎక్కువ తింటున్నాం అనే విషయాన్ని వాళ్లు గ్రహించలేరు. సరే టిఫిన్ చేయమన్నారు.. కానీ ఏం చేయాలి…ఏది పడితే అది తింటే.. మళ్లీ అదో లొల్లి.. ఇప్పుడు చెప్పుకోబోయే ఈ అల్పాహారాలను ఓ సారి ట్రే చేయండి.

కార్న్‌ఫ్లేక్స్- మిల్క్ కార్న్‌ఫ్లేక్స్ కూడా మంచి టిఫెన్ అని చెప్పవచ్చు. కార్న్‌ఫ్లేక్స్‌ కరకరలాడటంతోపాటు మస్త్ టేస్ట్ ఉంటుంది. కార్న్‌ఫ్లేక్స్‌లో థయామిన్ ఉంటుంది ఇది మెటబాలిజం రేట్ ను, శక్తిని పెంచుతుంది.

ఉప్మా- మీరు డైట్‌లో ఉంటే బొంబాయి రవ్వతో చేసిన ఉప్మా తినవచ్చు. ఇది ఆరోగ్యకరమైన అల్పాహారం. ఉప్మాలో మీకు నచ్చిన కూరగాయలను ఎక్కువగా చేర్చుకుంటే.. అది ఇంకా టేస్టీగా ఉంటుంది.. దీంతో శరీరానికి పీచు పుష్కలంగా అందుతుంది. ఉప్మా కూడా సులువుగా జీర్ణం అవుతుంది. తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలి వేయదు.

పోహా- అల్పాహారానికి పోహా మంచి ఎంపిక. నార్త్ వాళ్లు ఎక్కువగా వీటిని తింటారు. అందరూ పోహా తినడానికి ఇష్టపడతారు. పోహా చాలా తేలికగా ఉంటుంది.. ఇది ఇంకా.. తేలిగ్గా జీర్ణమవుతుంది. పోహాలో కూరగాయల పరిమాణాన్ని కూడా పెంచుకోవచ్చు. ఒక ప్లేట్ పోహ, దానితో పాటు మజ్జిగ తాగడం వల్ల ఇది చాలా కాలం పాటు ఉత్సాహంగా ఉంచుతుంది. దాంతో బరువు కూడా పెరగదు.

ఓట్స్- ఓట్స్ తో చాలా.. సింపుల్ గా ఏదైనా చేసుకోవచ్చు..నిమిషాల్లో ఓట్స్ తయారు చేసుకోని తినవచ్చు. ఫైబర్ పుష్కలంగా, సూపర్ హెల్తీగా ఉండే అల్పాహారంలో ఓట్స్ నెంబర్ వన్.. తినడానికి చాలా రుచిగా ఉంటాయి. ఓట్స్ తింటే ఎక్కువ సేపు ఆకలిగా అనిపించదు. ఉదరం, గుండె, మధుమేహ రోగులకు కూడా ఓట్స్ చాలా మేలు చేస్తుంది.

ఓట్ మీల్- బరువు తగ్గడానికి, మీరు అల్పాహారంలో తప్పనిసరిగా ఓట్ మీల్‌ను చేర్చుకోవాలి. ఓట్ మీల్ ఎంత ఫిట్‌నెస్ ఫుడ్ అంటే.. ఇది తింటే.. కడుపు నిండుగా ఉంటుంది. తక్కువ తిన్నా.. పొట్టనిండుగా ఉన్నవి తీసుకుంటే.. త్వరగా ఆకలి వేయదు.. దాంతో ఏదీ వెంటనే తినాలనిపించదు.

పైన చెప్పిన అన్ని టిఫెన్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల బరువు కూడా తగ్గొచ్చు.. ఇంకెందుకు ఆలస్యం… వారానికి సరిపడా ప్లాన్ చేసేసుకోండి..!

Read more RELATED
Recommended to you

Latest news