తెలంగాణ ప్రభుత్వం తీరుతో ఏఈవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పనిభారం అధికం అవుతోందని, ఎన్నిమార్లు మొర పెట్టుకున్నా తమ సమస్యలు పరిష్కరించడం లేదని వాపోయారు. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేసేందుకు సైతం వెనుకాడబోమని ఏఈవీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే తాము 49 రకాల విధులను నిర్వహిస్తుంటే ప్రభుత్వం అష్టకష్టాలు పెడుతుందని ఏఈవోల ఆవేదనకు గురువుతన్నారు.
రాష్ట్రంలో మొత్తం 2,601 ఏఈవోలు ఉంటే అందులో 60 శాతం మహిళలే ఉన్నారని తెలిపారు. క్రాప్ సర్వే యాప్‌ను వ్యక్తిగత సెల్‌ఫోన్లో అప్‌లోడ్ చేయమంటున్నారని, అప్పుడు తమ వ్యక్తిగత సమాచారం యాప్ కంపెనీలకు వెళ్తందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే సాధ్యం కాదని, ఏపీలో మాదిరిగా సహాయకులను నియమించాలని, ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా వివిధ మార్గాల్లో సర్వే చేయించాలని లేదంటే సమ్మె చేస్తామని ఏఈవోల ప్రభుత్వాన్ని హెచ్చరించారు.