Twitter Poll Results : ప్రధానిగా యోగి.. జై కొట్టిన నెటిజ‌న్ !

-

Twitter Results : యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. నిన్నటి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఫలితాల దెబ్బకు.. యోగినే కాబోయే ప్రధానమంత్రి అంటూ సోషల్ మీడియాలో అలాగే రాజకీయ విశ్లేషకులు చర్చలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో దేశానికి కాబోయే ప్రధాని యోగి నే అంటూ పోల్స్ కూడా నిర్వహిస్తున్నారు. మోడీ తర్వాత అమిత్ షా ను ప్రధానిని చేయాలని అందరూ అనుకున్నప్పటికీ… చాలామంది ప్రధానిగా యోగినే సరైనోడు అంటూ బీజేపీ నేతలే చెబుతున్నారు.

ఇటు సోషల్ మీడియాలో… యోగిని కాబోయే దేశ ప్రధాని అంటూ సపోర్ట్ చేస్తున్నారు. దాదాపు 66 శాతం మంది యోగిని ప్రధాని చేయాలంటూ ఓట్లు వేశారు. అంటే ఈ లెక్కన ప్రధాని మోడీ తర్వాత… యోగిని ప్రధాని చేసే అవకాశం కనిపిస్తోంది. అటు ఆర్ఎస్ఎస్ కూడా… యోగి కే మొగ్గు చూపే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం.. యోగి ధరించే కాషాయ దుస్తులే. భారతదేశాన్ని హిందూ సామ్రాజ్యంగా తయారు చేయాలన్న ఆర్ఎస్ఎస్ వాదనకు సరిపోయే వ్యక్తి యోగి మాత్రమే.

దీనికి తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా యోగి కి ఫాలోయింగ్ ఉంది. అటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండోసారి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన ఘనత యోగికే దక్కింది. వరుసగా రెండు సార్లు యూపీలో ఏ పార్టీ అధికారంలోకి ఇప్పటివరకు రాలేదు. కానీ ఆ సాంప్రదాయానికి చెక్ పెడుతూ… యోగి ప్రభంజనం సృష్టించాడు. రెండోసారి భారతీయ జనతా పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాని అభ్యర్థి ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. అటు చాలామంది దేశ్ కి ప్రధాని గా యోగి కే పట్టం కడుతున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version