ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మోహన్ భగవత్ వి చిల్లర మాటలు అని, హిందూ ముస్లింలను వేరు చేసే కుట్ర అని ఫైర్ అయ్యారు. అసలు మోహన్ భగవత్ ఎవరని ప్రశ్నించిన కేటీఆర్.. ఆయన ఎప్పుడైనా కౌన్సిలర్ గానైనా గెలిచారా? అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఘాటుగా స్పందించారు.
ట్విట్టర్ పిట్ట మోహన్ భగవత్ కాలిగోటికి కూడా సరిపోడని కౌంటర్ ఇచ్చారు. భగవత్ సాహసాలకు కేటీఆర్, కెసిఆర్ కుటుంబం ఏమాత్రం సరితూగరని విమర్శలు చేశారు. ఆర్ఎస్ఎస్ ముందు మీరెంతా.. మీ స్థాయి ఎంత అంటూ లక్ష్మణ్ ధ్వజమెత్తారు. టిఆర్ఎస్, ఎంఐఎం దోస్తీ కారణంగా రాష్ట్రంలో ఆగడాలు విపరీతంగా పెరిగిపోయాయని.. వాటిని తట్టుకోలేక మలక్ పేటకు చెందిన టిఆర్ఎస్ నేతలు కొందరు బిజెపిలో చేరారని అన్నారు.
పాతబస్తీలో మజ్లీస్ వైపు కన్నెర్ర చేసే సాహసం ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని వారు భావిస్తున్నారని.. కానీ ప్రజలు వీరిని ఎదుర్కొనే దమ్ము బిజెపికి మాత్రమే ఉందని తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు.