మోస్ట్ ట్విటెడ్ సౌతిండియన్ స్టార్లలో కోలివుడ్ స్టార్ విజయ్ తర్వాతే పవన్, మహేష్

-

2021 చివరికి వచ్చింది మరికొన్ని రోజులైతే కొత్త సంవత్సరం 2022 రానుంది. ఈసారి కూడా ట్విట్టర్ ఇండియా మోస్ట్ ట్విటెడ్ సౌతిండియా యాక్టర్లు, హీరోయిన్లు, సినిమా డాటాను వెల్లడించింది. అభిమానులు తమ అభిమాన యాక్టర్, ఆయన చేస్తున్న సినిమాలు, వాటి విశేషాల గురించి ట్విట్లు చేస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులు చేస్తుంటారు. ఈసారి ఎవరి గురించి, ఏ సినిమా గురించి అభిమానలు అధిక ట్విట్లు చేశారనే వివరాలను ట్విట్టర్ ఇండియా వెల్లడించింది. తాజాగా దీంట్లో కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ మొదటి స్థానంలో నిలిచారు. తరువాతి రెండు, మూడు స్థానాల్లో తెలుగు స్టార్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబు నిలిచారు. ఈ ఏడాది అత్యధికంగా ట్విట్లు సాధించిన సినిమాలో విజయ్ నటించిన మాస్టర్ మొదటి స్థానంలో నిలిచింది. అజిత్ కుమార్ వాలిమై రెండో స్థానంలో నిలిచింది. పవన్ కళ్యాన్ నటించిన వకీల్ సాబ్ 5 వస్థానంలో, ట్రిపుల్ ఆర్ 6వ స్థానంలో నిలిచాయి. ఎక్కువగా ట్విట్లు సాధించిన హీరోయిన్లలో కీర్తీ సురేష్ మొదటిస్థానంలో, రెండో  స్థానంలో పూజా హెగ్డే ఉన్నారు.

టాప్ 10 హీరోలు

1.విజయ్‌

2.పవన్‌కల్యాణ్‌

3.మహేశ్‌బాబు

4.సూర్య

5.తారక్‌

6.అల్లు అర్జున్‌

7.రజనీకాంత్‌

8.రామ్‌చరణ్‌

9.ధనుష్‌

10.అజిత్‌

టాప్ 10 హీరోయిన్లు...

1.కీర్తి సురేష్

2.పూజాహెగ్డే

3.సమంత

4.కాజల్‌

5.మాళవికా మోహన్‌

6.రకుల్‌ ప్రీత్‌సింగ్‌

7.సాయిపల్లవి

8.తమన్నా

9.అనుష్క

10.అనుపమ పరమేశ్వరన్‌

టాప్ 10 మూవీస్

1.మాస్టర్‌

2.వాలిమై

3.బీస్ట్‌

4.జైభీమ్‌

5.వకీల్‌సాబ్‌

6.ఆర్‌ఆర్‌ఆర్‌

7.సర్కారువారి పాట

8.పుష్ప

9.డాక్టర్‌

10.కేజీఎఫ్‌-2

Read more RELATED
Recommended to you

Exit mobile version