ఉక్రెయిన్ వైద్య విద్యార్థుల తరుపున సుప్రీంకోర్టులో పిల్…

-

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఉక్రెయిన్ లో మెడికల్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. యుద్ధం కారణంగా చాలా మంది విద్యార్థులు ప్రాణాలు చేతిలో పట్టుకుని స్వదేశానికి వచ్చారు. మెడికల్ విద్యను మధ్యలో ఆపేసిని విద్యార్థులకు వాళ్ల పరిస్థితి ఏమిటో తెలియడం లేదు. వాళ్లంతా ఆర్థికంగా, విద్యాపరంగా చాలా నష్టపోయారు. ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల వల్లకాడులా మారిపోయింది. ఒక వేళ యుద్ధం ఆగినా.. వెంటనే వెళ్లి చదువుకునే పరిస్థితి లేదు.

తాజాగా ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి వచ్చిన విద్యార్థుల తరుపున సుప్రీం కోర్ట్ లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది. న్యాయవాది రాణా సందీప్ బుస్సా సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. రాజ్యాంగంలో అధికరణ 21 ప్రకారం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్ట్ ని కోరారు. భారత్ లోనే చదువు కొనసాగించాలని కోరుతూ పిల్ దాఖలు చేసింది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా విద్యార్థుల భవిష్యత్తు గురించి కేంద్రాన్ని ప్రశ్నించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version