Ukraine crisis: బైడెన్ కీలక ప్రకటన.. రష్యాకు ఇక తిప్పలే

-

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 3 నెలుల దాటింది. అయినా ఉక్రెయిన్ పై రష్యా తన దాడులు ఆపడం లేదు. తూర్పు ప్రాంతాలపై విరుచుకుపడుతోంది. బాన్ బోస్ ప్రాంతంలోని నగరాలను, పట్టణాలను ఆక్రమించుకుంటోంది. అక్కడ ప్రధాన పట్టణాలతో ఉక్రెయిన్ కు ఉన్న సంబంధాలను అడ్డుకుంటోంది. ఇదిలా ఉంటే ప్రపంచంలో అతిపెద్ద సైనిక శక్తి ముందు ఉక్రెయిన్ కొన్ని రోజుల్లోనే లొంగిపోతుందని అనుకున్నప్పటికీ అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాల సాయంతో ఎదురొడ్డిపోరాడుతోంది. దీంతో రాజధాని కీవ్ ను ఆక్రమించుకోవాలని అనుకున్న రష్యా వ్యూహాలు దెబ్బతిన్నాయి. 

ఇదిలా ఉంటే ఇటీవల అమెరికా, ఉక్రెయిన్ కు 40 బిలియన్ డాలర్ల భారీ సాయాన్ని చేసింది. సైనికంగా, ఆయుధాల పరంగా అమెరికా, ఉక్రెయిన్ కు అండగా నిలుస్తోంది. రష్యాకు ఎదురుగా పోరాడేందుకు సైనిక వ్యూహాలను అందిస్తోంది. ఇదిలా ఉంటే బైడెన్ మరో కీలక ప్రకటన చేశారు. ‘కీలక లక్ష్యాలను’ చేధించేందుకు ఉక్రెయిన్‌కు ‘అధునాతన రాకెట్ వ్యవస్థలను’ అమెరికా అందజేస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మంగళవారం తెలిపారు. దీంతో ఉక్రెయిన్ మరింతగా రష్యన్ బలగాలపై విరుచుకుపడే అవకాశం లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news