Breaking: కేంద్రమంత్రి రాజీనామా.. ఉపరాష్ట్రపతి బరిలో..?

-

ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో.. కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా కొన‌సాగుతున్న బీజేపీ సీనియ‌ర్ నేత ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ చేత కేంద్ర మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయించింది. పార్టీ ఆదేశాల మేర‌కు బుధ‌వారం సాయంత్రం త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగుతున్న న‌ఖ్వీ… కేంద్ర కేబినెట్‌లో మైనారిటీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. పార్టీలో మైనారిటీ వ‌ర్గానికి చెందిన నేత‌గా న‌ఖ్వీకి మంచి ప్రాధాన్య‌మే ద‌క్కింది.

ఈ క్ర‌మంలో ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఆయ‌న‌ను బ‌రిలోకి దించేందుకు బీజేపీ ప్లాన్‌ చేస్తోందని వార్తలు వినిపిస్తోన్నాయి. బుధ‌వారం జ‌రిగిన కేబినెట్ భేటీలో పాల్గొన్న న‌ఖ్వీ సేవ‌ల గురించి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కీర్తించారు. కేబినెట్ భేటీ ముగిసిన అనంత‌రం త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ. అయితే రాజ్యసభ సభ్యుడిగా బుధవారంతో పదవీకాలం ముగిసిన నేపథ్యంలోనే నఖ్వీ మంత్రి పదవికి రాజీనామా చేశారన్న వాదనలూ కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి.. ఆయన ఉప రాష్ట్రపతి బరిలో దిగుతారా లేదా అని..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version