Unstoppable Trailer : ప్రశ్నల్లో మరింత ఫైర్.. ఆటల్లో మరింత డేర్

-

సినిమాల‌తోనే కాకుండా హోస్ట్ గా త‌న‌లోని మ‌రో టాలెంట్ ను బ‌య‌ట పెడుతూ.. దిగ్విజ‌యంగా ముందుకు సాగుతున్నారు హీరో నంద‌మూరి బాల కృష్ణ‌. తెలుగు ఓటీటీ ఆహా వేదిక‌గా ప్ర‌సార‌మ‌వుతున్న అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే అనే షో లో బాల‌య్య హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ టాక్ షో కు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

టాలీవుడ్‌ స్టార్లు ఈ షోకు వచ్చి సందడి చేశారు. అయితే.. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK2’ మళ్లీ రాబోతోంది. ‘అన్ స్టాపబుల్ విత్ NBK2’ తో బాలయ్య అలరించేందుకు రాబోతున్నట్లు ఇప్పటికే ఓటిటి ప్లాట్ ఫామ్ ‘ఆహా’ ప్రకటించింది.

ఇక ఈ షో ఎపిసోడ్‌ ఈ నెల 14వ తేదీను ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో… ట్రైలర్‌ ను రిలీజ్‌ చేశారు. ఇందులో బాలయ్య అదిరిపోయే లుక్‌ మరియు డైలాగులతో ఆకట్టుకున్నారు. ప్రశ్నల్లో మరింత ఫైర్!ఆటల్లో మరింత డేర్!!సరదాల్లో మరింత సెటైర్!!! మీకోసం… మరింత రంజుగా…దెబ్బకు థింకింగ్ మారిపోవాలా! అంటూ బాలయ్య చెప్పే డైలాగ్స్‌ అదరహో అనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version