ఉత్తర్ ప్రదేశ్ బీజేపీకి మరో షాక్…24 గంటల్లో రెండో మంత్రి రాజీనామా

-

ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ పార్టీకి వరసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 24 గంటల్లో మరో మంత్రి యోగీ ఆదిత్య నాథ్ క్యాబినెట్ కు రాజీనామా చేశారు. ఉత్తర్ ప్రదేశ్ మంత్రి వర్గంలో మంత్రిగా ఉన్నా దారా సింగ్ చౌహన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. యూపీ మంత్రి వర్గంలో ఆయన పర్యావరణ మంత్రిగా ఉన్నారు. ‘‘నేను అంకితభావంతో పనిచేశాను, అయితే వెనుకబడిన, అణగారిన వర్గాలు, దళితులు, రైతులు, నిరుద్యోగ యువత పట్ల ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత వైఖరి, వెనుకబడిన, దళితుల కోటాను విస్మరించడంతో బాధ పడి రాజీనామా చేస్తున్నాను’’ అని చౌహాన్ తన రాజీనామా లేఖలో రాశారు.

అంతకుముందు స్వామి ప్రసాద్ మౌర్య తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. వీరిద్దరితో పాటు బీజేపీకి మరో 4 ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం బీజేపీలో ప్రకంపనలు కలిగించింది. యూపీ మంత్రి వర్గంలో ఉన్న ఇద్దరు ఓబీసీ మంత్రులు రాజీనామా చేయడం.. ఎన్నికల ముందు బీజేపీ పార్టీకి ఓబీసీ ఓట్లను దూరం చేస్తాయనే వాదన ఉంది. ప్రస్తుతం రాజీనామా చేసిన మంత్రి ధారా సింగ్ త్వరలోనే అఖిలేష్  యాదవ్ సమక్షంలో సమాజ్ వాదీ పార్టీలో చేరుతారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news