హరి హర వీరమల్లు నుంచి బిగ్‌ అప్డేట్‌

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షూటింగ్‌లో ఓ వార్ ఎపిసోడ్‌ను దర్శకుడు క్రిష్ చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ.. ఈ సినిమా షూటింగ్‌లో ప్రస్తుతం పవన్ కల్యాణ్ పాల్గొనడం లేదట. పవన్‌ డూప్‌తో ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరిస్తున్నాడట. పవన్‌ తర్వాత సెట్స్‌ లో జాయిన్ కానుండగా..పవన్‌ క్లోజప్‌ షాట్స్‌ క్రిష్ తీయబోతున్నాడని ఇన్‌సైడ్‌ టాక్‌. హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు చిత్రంలో నిధి అగ‌ర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.

బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీర‌వాణి మ్యూజిక్ డైరెక్టర్‌‌. ఇప్పటికే విడుద‌లైన హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. పీరియాడిక్ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇదివ‌ర‌కెన్నడూ క‌నిపించ‌ని పాత్రలో సంద‌డి చేయ‌బోతున్నాడు. ఈ చిత్రన్నా 2023 ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు టాక్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version