మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. సబ్ డివిజన్ ఇంజనీర్ పోస్టుల ఖాళీల భర్తీ చేయడానికి UPSC జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు.
దరఖాస్తుకు డిసెంబర్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 ఖాళీలను భర్తీ చేయనున్నారు. యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in లో అప్లై చేసుకోచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో రూ. 25ను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఫీజు చెల్లించవచ్చు. ఎస్సీ/ఎస్టీ/PWD అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు వుంది. సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోచ్చు. వయస్సు వచ్చేసి 35 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 30తో ముగియనుంది. కనుక ఈలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎలా అప్లై చేసుకోవాలనేది చూస్తే..
ముందు అధికారిక వెబ్ సైట్ upsc.gov.in ను ఓపెన్ చేయాలి.
నెక్స్ట్ ONLINE RECRUITMENT APPLICATION (ORA) FOR VARIOUS RECRUITMENT POSTS ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Sub Divisional Engineer దగ్గర Apply Now ఉంటుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
లాగిన్ ఫామ్ కనిపిస్తుంది. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే New Registration ఆప్షన్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి అంతే.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకంని ఫాలో అవ్వండి.