వ్యాక్సిన్ సర్టిఫికేట్ లో స్పెల్లింగ్ మిస్టేక్.. అరెస్టు చేసిన పోలీసులు

-

ఇతర దేశాలకు వెళ్ళాలంటే వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి అని తెలియనిది కాదు. అది కూడా ఆయా దేశాలు గుర్తించిన వ్యాక్సిన్ డోసులు మాత్రమే స్వీకరించి ఉండాలి. పర్యాటక రంగంలో వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మారిపోయింది. ఐతే ప్రస్తుతం, ఈ వ్యాక్సిన్ సర్టిఫికేట్లు దొంగ సర్టిఫికేట్లు వచ్చేస్తున్నాయి. తాజాగా జరిగిన సంఘటనే అందుకు సాక్ష్యం. 24ఏళ్ళ ఒక మహిళ, హవాయి ప్రాంతాన్ని సందర్శించడానికి బయలుదేరింది. ఎయిర్ పోర్టులో వ్యాక్సిన్ సర్టిఫికేట్ చూపించమన్న అధికారికి తాను తయారు చేసుకున్న సర్టిఫికేట్ అందించింది.

ఐతే అన్ని సరిగ్గానే చేసుకున్న ఆ మహిళ, వ్యాక్సిన్ కంపెనీ స్పెల్లింగ్ తప్పుగా రాసింది. Moderna కి బదులు ‘Maderna’ అని రాయడంతో దొరికిపోయింది. దీంతో ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ వాళ్ళు ఆమెను పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఇష్యూ కోర్టులో ఉంది. ప్రస్తుతం ఈ ఇష్యూ కోర్టులో ఉంది. నివాస ప్రాంతమైన ఇల్లినాయిస్ లో వ్యాక్సిన్ వేయించుకోకుండా దెలావర్ లో వ్యాక్సిన్ వేయించుకున్నట్టుగా సర్టిఫికేట్ లో పొందుపరిచింది. ఆ మహిళ పుట్టిన తేదీ సహా అని వివరాలు తీసుకుని చెక్ చేస్తే, దెలావర్ లో వ్యాక్సిన్ తీసుకున్నట్టు ఎలాంటి వివరాలు లేవని అధికార్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version