లోకేష్ ని కోతి, పిచ్చి కుక్కతో పోల్చిన వల్లభనేని వంశీ…!

-

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మధ్య ఫేస్బుక్ వేదికగా మాటల యుద్ధం జరిగింది. లోకేష్… వంశీ జగన్ కి మద్దతు ఇవ్వడాన్ని ఉద్దేశించి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ తో ఎమ్మెల్యేలు భేటి అయిన వీడియోని ఆయన తన ఫేస్బుక్ పేజి లో పోస్ట్ చేయడంతో దుమారం రేగింది.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌ను తాను సంత‌లో గొర్రెల్లా ఎలా కొన్నాడో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు వినండి. జ‌గ‌న్ గారి మ‌రో ప్ర‌త్యేక‌త ఏంటంటే గొర్రెల‌తోపాటు గొర్రెల డాక్ట‌ర్‌నీ కొన్నారు.” అని లోకేష్ పోస్ట్ చేసారు. దీనిపై కాసేపటికి వంశీ ఘాటుగా స్పందించారు. లోకేష్ ని కోతితో పోలుస్తూ ఆయన కామెంట్ చేయడంతో ఒక్కసారిగా వాతావరణం హీట్ ఎక్కింది. ఆయన మంగళగిరిలో పోటీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు.

అసలే కోతి, ఆపైన కల్లు తాగింది. వద్దంటే మంగళగిరికి వెళ్ళింది. చిత్తుగా ఓడిపోయింది. మండలి పోయింది. ఉన్నది కాస్తా ఊడిపోయింది. ఎం చెయ్యాలో తోచడం లేదు. అందుకే పిచ్చి కుక్క కరిస్తే అరిచినట్లు పిచ్చి పిచ్చి కామెంట్లు… గోర్రేలకే కాదు, ఇటు వంటి పిచ్చి కుక్కలకూ నా దగ్గర అత్యద్భుతమైన వైద్యం వుంది. డా. వల్లభనేని వంశీ” అని వంశీ చేసిన కామెంట్ ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news