వనమాకు ‘వారసుడు’ దెబ్బ..నెక్స్ట్ కష్టమే?

-

ఈ సారి జంపింగ్ ఎమ్మెల్యేలు గెలవడం కష్టమే అని ఇటీవల వచ్చిన పలు సర్వేల్లో తేలిన విషయం తెలిసిందే…కాంగ్రెస్ నుంచి 12, టీడీపీ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్లు ఇద్దరు టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో జంపింగ్ నేతలకు కేసీఆర్ ఇమేజ్, తెలంగాణ సెంటిమెంట్ కలిసొచ్చింది..కానీ ఈ సారి అలా కలిసొచ్చే పరిస్తితి లేదని తెలుస్తోంది. ఈ సారి జంపింగ్ ఎమ్మెల్యేలకు ఓటమి తప్పదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లోకి వెళ్ళిన పరిస్తితి దారుణంగా ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వచ్చారు. ఇక వీరు గాని టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే గెలుపు గగనమే అని తేలుతుంది.  ఇల్లందులో హరిప్రియ, పినపాకలో రేగా కాంతారావు, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరావు, పాలేరులో ఉపేందర్ రెడ్డిలకు మళ్ళీ గెలుపు కష్టమనే తెలుస్తుంది.

అటు టీడీపీ నుంచి వచ్చిన వారిలో సత్తుపల్లి ఎమ్మెల్యే వీరయ్య కూడా ఓటమి అంచుకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అలాగే వైరాలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచి, టీఆర్ఎస్ లో చేరిన రాములు నాయక్ పరిస్తితి కూడా కష్టంగానే ఉంది. మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జంపింగ్ ఎమ్మెల్యేల పరిస్తితి దారుణంగానే ఉంది. ఇదే సమయంలో కొత్తగూడెంలో తిరుగులేని నేతగా ఉన్న వనమాకు వారసుడు దెబ్బ బాగా తగిలినట్లు తెలుస్తోంది. వనమా రాఘవ వేధింపులు భరించలేక.. పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ కేసులో రాఘవ అరెస్ట్ అయ్యారు..అలాగే నేరాన్ని అంగీకరించారు కూడా…ఇక రాఘవ వ్యవహారం వనమాకు బాగా నెగిటివ్ అయింది. ఇప్పటివరకు కొత్తగూడెంలో వనమాకు ఉన్న మంచి పేరు పోయింది. వారసుడు వల్లే నెక్స్ట్ ఎన్నికల్లో వనమా సైతం గెలుపుకు దూరమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..అసలు సీటు దక్కుతుందో లేదో కూడా డౌటే.

Read more RELATED
Recommended to you

Latest news