వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలు ఇవే..!

-

తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికుల కోసం సికింద్రాబాద్ నుంచి విశాఖకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ 2.0ను ఈనెల 19న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రైలును ఎలా తీర్చిదిద్దారు.. దాని ప్రత్యేకతలేంటో ఒకసారి చూద్దాం.

హై స్పీడ్ రైళ్లు నడపాలనేది ఇండియన్ రైల్వేకు ఎప్పటినుంచో ఉన్న ఆలోచన. 2017లో దేశీయంగానే సెమీ హైస్పీడ్‌ రైళ్లు తయారీ చేయాలని డిసైడ్ అయింది భారత ప్రభుత్వం. గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించడమే లక్ష్యంగా చెన్నైలోని ఐసీఎఫ్‌లో ‘ట్రైన్‌-18’ ప్రాజెక్టు పట్టాలెక్కింది. తొలి టెస్ట్‌ రన్‌ నిర్వహించగా 180 కి.మీ వేగంతో ఈ రైలు ప్రయాణించింది. అయితే దేశంలోని ఏ ట్రాక్‌లూ ఆ వేగాన్ని తట్టుకునే స్థాయిలో లేకపోవడంతో ఈ రైళ్ల వేగాన్ని 130 కి.మీకు పరిమితం చేశారు. ‘ట్రైన్‌-18’కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌(1.0)గా నామకరణం చేశారు. 2019 ఫిబ్రవరి 15న దిల్లీ – వారణాసి మధ్య తొలి రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.

ఇక వందే భారత్ 2.0 విషయానికి వస్తే..

  • వందేభారత్‌ రైలు బరువు 392 టన్నులు. తయారీకి రూ.115 కోట్లు ఖర్చవుతోంది.
  • ఈ రైలుకు మొత్తం 16 ఏసీ బోగీలుంటాయి.. 1,128 సీట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది.
  • జీపీఐఎస్‌ బేస్డ్‌ ప్యాసింజర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఉంది.
  • ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు
  • వైఫై సదుపాయం
  • కవచ్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్ సిస్టమ్‌.
  • బ్యాక్టీరియా ఫ్రీ ఎయిర్‌ కండిషనింగ్‌ సిస్టమ్‌.
  • అన్ని కోచ్‌లలో రిక్లైనబుల్‌ సీట్లు.
  • వీటిలో 32 ఇంచుల టెలివిజన్‌ సదుపాయం.
  • ఆటోమాటిక్‌ ప్లగ్ డోర్స్‌, టచ్‌ ఫ్రీ స్లయిడింగ్‌ డోర్స్‌.
  • ఎమర్జెన్సీ కమ్యూనికేషన్‌ యూనిట్.
  • విశాలమైన డ్రైవర్‌ క్యాబిన్‌.
  • హయ్యర్‌ ఫ్లడ్ ప్రొటెక్షన్‌

Read more RELATED
Recommended to you

Exit mobile version