లోకేశ్‌తో పాదయాత్రలో పాల్గొన్న వంగవీటి రాధా

-

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర188వ రోజుకు చేరుకుంది. నేటి నుంచి వారం రోజులపాటు ఉమ్మడి కృష్ణాజిల్లాలో యువగళం పాదయాత్ర జరగనుంది. అయితే.. విజయవాడలో ఈ సాయంత్రం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. యువగళం పాదయాత్ర విజయవాడలో ప్రవేశించగా… టీడీపీ యువనేత నారా లోకేశ్ ను వంగవీటి రాధా కలిశారు. వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో, ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

వంగవీటి రాధా… పాదయాత్రలో లోకేశ్ తో కలిసి నడిచారు. ఈ సందర్భంగా నినాదాలు మిన్నంటాయి. “జై లోకేశ్, జై రాధా” అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.

లోకేశ్ యువగళం పాదయాత్ర ఇవాళ మంగళగిరి నియోజకవర్గం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రవేశించింది. లోకేశ్ రాకతో విజయవాడ టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version