చికోటి ప్రవీణుతో వైసీపీ నేతలకు సంబంధం ఉంది : వర్ల రామయ్య

-

గత సంక్రాంతి పండుగ సందర్బంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ నేతృత్వంలో గుడివాడలో చికోటీ ప్రవీణ్ క్యాసినో నిర్వహించి ప్రజలను నిలువు దోపిడి చేశారని ఆరోపించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. తాజాగా ఆయన మాట్లాడుతూ.. చికోటి ప్రవీణ్ ఇప్పడు నేపాల్ లో నిర్వహించిన క్యాసినోలో వేల కోట్ల హవాలా ధనం చేతులు మారినట్లు గుర్తించి ఈడీ సోదాలు జరిపిందని, నేపాల్ క్యాసినోకి రాష్ట్రం నుంచి వేలాది మంది వెళ్లారన్నారు. ఇందులో సగం మంది అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలున్నారని అంటున్నారని, వారి నుంచి ఒక్కక్కరికి దగ్గర చికోటి ప్రవీణ్ రూ.3 లక్షలు వసూలు చేసి మందు, విందు,సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారన్నారు.

క్యాసినో క్రీడతో వైసీపీ నేతలు బ్లాక్ మనినీ వైట్ మనీగా మార్చుకుంటున్నారని, గుడివాడ క్యాసినో కేరళ నుంచి వచ్చిన పెద్దలు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారన్నారు. దీనిపై కేరళ ప్రభుత్వం స్పందించినా జగన్ మాత్రం కనీసం విచారణ జరపలేదని, పైగా టీడీపీ నిజనిర్దారణ కమిటీపై అక్రమ కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. చికోటి ప్రవీణ్‌తో వైసీపీ నేతలకు సంబంధం ఉందని, వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ తదితర ఇళ్లలో కూడా ఈడీ సోదాలు జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. క్యాసినో పేరుతో ఎన్నో కుటుంబాలను నాశనం చేసిన పాపం ఊరికే పోదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version