ఇది రాష్ట్రమా, రావణ కాష్టమా..? : వర్ల రామయ్య

-

ఇది రాష్ట్రమా, రావణ కాష్టమా..? అని వ్యాఖ్యానించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొద్దున్నే కత్తిపోట్లు, మధ్యాహ్నం మర్డర్లు, సాయంత్రం సజీవ దహనాలు, రాత్రిళ్ళు రేపులు- గ్యాంగ్ రేపులు ఇదీ రాష్ట్ర పరిస్థితి అని ఆయన మండపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, పగలు బయటికి వెళ్లిన వ్యక్తి రాత్రికి ఇంటికి క్షేమంగా తిరిగి వస్తాడన్న గ్యారెంటీ లేదన్నారు. ఈ నెల 13వ తేదీన విశాఖ జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఎంపీ భార్య, కొడుకు, ఆడిటర్ లను కిడ్నాప్ చేస్తే 15వ తేదీ వరకు పోలీసులకు తెలియలేదని, ఆ ఎంపీకి పోలీసు వ్యవస్థ పై నమ్మకం లేనట్లు లెక్క అని ఆయన అన్నారు.

అంతేకాకుండా.. ‘ఈ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసు గురించి రాష్ట్ర డిజిపి పెట్టిన ప్రెస్ మీట్ అంతా అసత్యాల పుట్ట. ఈ ప్రెస్ మీట్ వాస్తవాలకు దూరంగా ఉంది. డీజీపీ వైజాగ్ లో రౌడీలు లేరనటం, భూ కబ్జాలు జరగలేదనటం హాస్యాస్పదం-బూటకం. ఒక్క జూన్ నెలలోనే.. 1వ తేదీన విజయనగరం జిల్లా హైవేపై ఒక వ్యాపారి కంట్లో కారం కొట్టి తుపాకితో బెదిరించి రూ 50 లక్షలు దోచుకెళ్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు సజావుగా ఉన్నట్లా? ఈనెల 5వ తేదీన ప్రకాశం జిల్లాలో దళిత మహిళ హనుమాయమ్మను ట్రాక్టర్ తో గుద్ది తొక్కించి తొక్కించి చంపితే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్లా? ఈ నెల 11వ తేదీన నెల్లూరులో టాబ్లెట్ల కోసం మెడికల్ షాప్ కు వెళ్తున్న మహిళను అందరూ చూస్తుండగా లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ చేస్తే శాంతి భద్రతలు సజావుగా ఉన్నట్లా? ఈ నెల 12న చిత్తూరు పోలీసు స్టేషన్లో సాక్షాత్తు పోలీసు జీపును దొంగలిస్తే, ఆ విషయం ఆరు గంటల వరకు పోలీసులకు తెలియదంటే, డిజిపి గారు ఈ విషయంపై ఏం సమాధానం చెబుతారు? ఈ నెల 13వ తేదీన ఏలూరులో తన చెల్లిని అల్లరి చేయొద్దు అన్నందుకు ఎడ్ల ఫ్రాన్సిక అనే దళిత మహిళపై దుండగులు దాడి చేస్తే శాంతి భద్రతలు సజావుగా ఉన్నట్లా..?’ అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version