బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ ను తోడేలు కరిచింది. అప్పటినుంచి వరుణ్ రాత్రిపూట తోడేలుగా మారుతున్నాడు. తోడేలుగా మారిన వరుణ్ ఏం చేస్తున్నాడో ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోవాలంటే ‘భేడియా’ మూవీ చూడాల్సిందే. వరణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటిస్తోన్న భేడియా ట్రైలర్ ను ఆ చిత్రబృందం ఇవాళ విడుదల చేసింది.
కేవలం హిందీలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తోడేలు కరవడంతో వరుణ్ తోడేలులాగా అయిపోతాడు. తోడేలులా మారిన తర్వాత వరుణ్ జీవితం ఎలా మారింది అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. అయితే వరణ్ కేవలం రాత్రిపూట మాత్రమే తోడేలుగా మారుతున్నాడు. కామెడీ హార్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అమర్ దర్శకత్వం వహించాడు.
మ్యాడ్ డాక్ ఫిలింస్ బ్యానర్‌పై దినేశ్ విజయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దినేష్ విజన్ ఇప్పటికే హార్రర్ కామెడీ యూనివర్స్‌లో సూపర్ హిట్ గా నిలిచిన ‘స్త్రీ’, ‘రూహీ’ సినిమాలను నిర్మించాడు. ఇక ‘భేడియా’ హ్యాట్రిక్ గా నిలవనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. నవంబర్ 25న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.