2023లో ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్‌ దే అధికారం : వీరప్ప మొయిలీ

-

2023లో ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్‌ దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు మాజీ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ. దేశంలోనే కాదు ప్రపంచలోనే యువ నాయకుడిగా వున్నారు రాజీవ్ గాంధీ అని.. 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించిన నేత అని చెప్పారు.. మహాత్మా గాంధీ కూడా దేశం కోసం బలయ్యారని… యువ ప్రధానిగా వున్న రాజీవ్ దేశం కోసం ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు.  చార్మినార్ వద్ద కాంగ్రెస్ సద్భావన దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హజరైన వీరప్ప మొయిలీ మాట్లాడుతూ..  ఈదేశం కోసం ప్రాణత్యాగాలు.. చేసిన రాజీవ్, ఇందిరాలను మరువలేమని… అస్సాం, త్రిపురా, తమిళ నాడు సమస్యలతో కొట్టు మిట్టాడుతుంటే.. వారి సమస్యలను రాజీవ్ పరిష్కరించారని వెల్లడించారు.

దేశ సమగ్రతను ఐక్యతను కాపాడేందుకు.. అనేక మంది జాతీయ నాయకులు.. వాళ్ల ప్రాణాలను త్యాగం చేశారని తెలిపారు. నేడు మళ్లీ సంతోషంగా ఉన్నామంటే.. ఆ మహనీయుల త్యాగ ఫలితమేనని… రాజీవ్ గాంధీ ఐదేండ్ల పరిపాలన ఒక స్వర్ణయుగమని కొనియాడారు.

అభివృద్ది, ఐక్యత, శాంతి, మత సామరస్యం.. అన్ని కాపాడుతూ.. రాజీవ్ పాలన చేశారని… దేశంలో అవినీతి నిర్మూలించేందుకు.. అవినీతి నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. రాజకీయాల్లో విలువలను పెంచేందుకు యాంటీడిఫెక్షన్ యాక్ట్ తీసుకొచ్చారని… నేడు మోడీ పాలనలో ప్రజాప్రతినిధులకు రెట్లు పెట్టి కొంటున్నారని చెప్పారు. అవినీతి నిర్మూలించేందుకు యుపిఎ పాలనలో లోక్ పాల్ బిల్లును తీసుకొస్తే.. దాన్ని అమలు చేయడంలో మోడీ ఫెయిల్‌ అయ్యారని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version