వీరసింహరెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై చాలా గందర గోళం నెలకొంది. ఒంగోలు ఏబియం గ్రౌండ్ లో ఈ నెల 6న జరగాల్సిన వీరసింహరెడ్డి సినిమా ప్రీ రిలీజ్ వేదికను మార్చేశారు. పక్క జిల్లాల నుంచి బాలకృష్ణ అభిమానులు తాకిడి ఎక్కువగా ఉంటుందని ఏబియం గ్రౌండ్ ఈవెంట్ నిర్వహణకు అనుమతి నిరాకరించారు ఏపీ పోలీసులు.
ఒంగోలు నగరంలో ఈవెంట్ నిర్వహించడం వలన ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒంగోలు నగరం బయట ఈవెంట్ నిర్వహించుకోవాలని సినిమా యూనిట్ నిర్వాహకులకు పోలీసులు సూచనలు చేశారు. ప్రత్యామ్నాయంగా నగర శివారు లోని అర్జున్ ఇన్ఫ్రా వెంచర్ లో వేదిక ఖరారు చేసిన వీరసింహరెడ్డి మూవీ యూనిట్.. అర్జున్ ఇన్ఫ్రా వెంచర్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వేళ ఇది కాకపోతే, వరంగల్ జరిపేందుకు కూడా ప్లాన్ వేస్తున్నారు.