నాగ చైతన్యతో వెంకటేష్ కూతురు ఆశ్రిత… బావా మరదళ్ల సరదా కబుర్లు

-

అక్కినేని నాగచైతన్య ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే మరోవైపు వ్యాపారంలో కూడా రాణిస్తున్నాడు
ప్రస్తుతం చైతూ ‘షోయు’ అనే ఫుడ్ బిజినెస్ లో పార్ట్నర్ గా ఉన్నాడు. తన బిజినెస్ కి సంబంధించిన పూర్తి వివరాలని వెంకటేష్ కుమార్తె ఆశ్రిత దగ్గుబాటితో కలిసి బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నాడీ హీరో..

నాగ చైతన్య ‘షోయు’ అనే ఫుడ్ బిజినెస్ లో పార్ట్నర్ గా ఉన్న సంగతి తెలిసిందే.. అయితే తన బిజినెస్ కి సంబంధించిన పూర్తి వివరాలని వెంకటేష్ కుమార్తె ఆశ్రిత దగ్గుబాటి బయట పెట్టే ప్రయత్నం చేయగా… షోయు కిచెన్ లో తన బావ నాగ చైతన్యతో ఆశ్రిత సరదాగా ముచ్చటించింది..

నాగ చైతన్యకి స్వీట్ హగ్ ఇచ్చి ఇంటర్వ్యూ మొదలు పెట్టిన ఆశ్రిత.. నాగ చైతన్యని బావ అని ముద్దుగా పిలుస్తూ అనేక విషయాలు తెలుసుకుంది. నేను మీకు ఈరోజు షోయు గురించి అనేక విషయాలు చెప్పబోతున్నాను. మా చై బావతో మాట్లాడబోతున్నా అని మొదలు పెట్టింది. ఆశ్రిత తన యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియో పోస్ట్ చేసింది. బావా మరదళ్ల సరదా ముచ్చట్లని నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు.. షోయు గురించి తెలుసుకుంది. నాగ చైతన్య మాట్లాడుతూ “షోయు అనేది రుచికరమైన జాపనీస్ ఫుడ్ కి తయారు చేయడం దీని ప్రత్యేకత. నేను నా ఫ్రెండ్స్ ముందుగా ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకున్నాం. కానీ లాక్ డౌన్ లో ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడం బాగా పెరిగింది. అందుకే షోయు ప్రారంభించాం..” అని నాగ చైతన్య తెలిపాడు. తర్వత తన ఇష్టమైన వంటకాల గురించి ఆశ్రితకు వివరించారు.. షోయు కిచెన్ మొత్తం తిరుగుతూ వీరిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఆశ్రిత ఆ కిచెన్ లో తయారు చేసే వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ ని తన యూట్యూబ్ ఛానల్ లో చూపించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version