ఇలాంటి పుస్తకాలు సమాజానికి చాలా అవసరం : వెంకయ్య నాయుడు

-

ఈరోజు హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్లో అతిరధ మహారధుల సమక్షంలోసంజయ్ కిషోర్ సేకరించి రచించి రూపకల్పన చేసిన ‘స్వాతంత్రోద్యమం- తెలుగు సినిమా- ప్రముఖులు’ పుస్తకావిష్కరణోత్సవం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా భారత మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుస్తకాన్ని విడుదల చేశారు. అనంతర ఆయన మాట్లాడుతూ తెలుగు భాష, సినిమాలు, ప్రస్తుత రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. నాకు ఆరోగ్యం సహకరించడం లేదు. నాకు వెన్నుముక నొప్పితో బాధపడుతున్నాను. అందుకే సభా సమయాన్ని చాలా తక్కువగా ఉండేలా చూడమని వేడుక నిర్వాహకులను అడిగాను. ప్రస్తుతం సభకు వచ్చే వారికి వినే ఓపిక కూడా తగ్గింది. అందుకే తక్కువగా మాట్లాడితే మంచిది అని తెలుసుకొన్నాను. విలువలు, జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

తెలుగు సినిమా పరిశ్రమ స్వాతంత్య్రం రాకముందు నుండి ఉన్నది. అందుకే ఈ పుస్తక రచయిత సంజయ్‌ కిశోర్‌ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న తెలుగు సినిమా ప్రముఖులు, అప్పటి పరిస్థితులు, సినిమాల గురించిన చక్కటి విశ్లేషణ చేశాడు. ఇలాంటి పుస్తకాలు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం. ఒకప్పుడు ఒక సభ నిర్వహిస్తున్నామంటే ఎక్కడెక్కడి నుండో ప్రజలు పాల్గొనేవారు అని వెంకయ్య నాయుడు తన ప్రసంగం లో తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version