త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి వేణు తొట్టెంపూడి ఆసక్తికర వ్యాఖ్యలు..

-

టాలీవుడ్ ప్రముఖ హీరో వేణు తొట్టెంపూడి..రవితేజ ‘రామారావు..ఆన్ డ్యూటీ’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘దమ్ము’ పిక్చర్ లో కనిపించిన వేణు తొట్టెంపూడి.. ఈ సినిమాలో ‘సీఐ మురళి’ పాత్ర పోషించారు. ఈ పిక్చర్ తో తాను సెకండ్ ఇన్నింగ్స్ట్ స్టార్ట్ చేసినట్లేనని వేణు తొట్టెంపూడి తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.

తను హీరోగా నటించిన ‘స్వయం వరం’, ‘చిరునవ్వుతో’ చిత్రాలకు ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్..డైలాగ్స్, స్టోరి అందించారు. ఈ నేపథ్యంలో అప్పట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలా ఉండేవాడు? ఆయనను చూసి ఏం తెలుసుకున్నాడో వివరించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా ఇంతటి స్థాయికి రావడం చూసి తాను గర్వపడుతున్నానని వేణు తొట్టెంపూడి చెప్పుకొచ్చారు.

తనకు ‘స్వయం వరం’ ఫిల్మ్ స్టోరి లైన్ చెప్పినపుడు తనకు బాగా నచ్చిందని తెలిపాడు. ‘చిరునవ్వుతో’ వంటి చిత్రంలో తను నటించానని గర్వపడుతానని వేణు పేర్కొన్నారు.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఉన్న కాన్ఫిడెన్స్ లెవల్స్ చూస్తే తనకు అసూయ కలుగుతుందని వేణు తొట్టెంపూడి అన్నారు. ఆయనొక అద్భుతమైన వ్యక్తి అని వేణు పొగిడారు. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామారావు..ఆన్ డ్యూటీ’ పిక్చర్ ఈ నెల 29న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news