కేంద్ర బడ్జెట్ పై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. బడ్జెట్ లో పసలేదని ఆయన అన్నారు. ఏపీకి కేంద్ర బడ్జెట్ వల్ల ప్రయోజనం శూన్యమని ఆయన అన్నారు. బడ్జెట్ పై రాజ్యసభలో ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలను చేశారు. ఆపరేషన్ సక్సెస్, పేషెండ్ డెడ్ అన్న రీతిలో కేంద్ర బడ్జెట్ ఉందని విమర్శించారు. కేంద్ర ఉద్దేశపూర్వకంగా సెస్, సర్ ఛార్జీలను పెంచుతుందని మండిపడ్డారు. సర్ ఛార్జీలు, సెస్ ల వల్ల రాష్ట్రాలకు దక్కేది 29 శాతమే అని ఆయన అన్నారు. రాష్ట్రాలకు పన్నుల వాటా పంచకుండా కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. కేంద్రం నుంచి ఏపీకి వచ్చే వాటా ఏడాదికేడాది తగ్గుతుందని ఆయన విమర్శించారు. ఏపీపైన కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తుందని అన్నారు. కాంగ్రెస్ లోపభూయిష్టంగా విభజన చట్టం తెస్తే…దాన్ని బీజేపీ అడ్వాంటేజ్ గా తీసుకుందని విమర్శించారు. ఈ బడ్జెట్ రాష్ట్రాలను విశ్వాసంలోకి తీసుకోలేదని ఆయన విమర్శించారు. జైరాం రమేష్ విభజన చట్టాన్ని సరిగ్గా చేయలేదని ఆయన అన్నారు. ఏపీ బీజేపీ ఏం కారణం లేకుండా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.
ఆపరేషన్ సక్సెస్, పేషెండ్ డెడ్.. కేంద్ర బడ్జెట్ పై విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు
-