లాక‌ప్ డెత్‌ల త‌గ్గుద‌ల‌లో ఆంధ్ర ప్ర‌దేశ్ తొలి స్థానంలో ఉంది : విజయసాయిరెడ్డి

-

లాక‌ప్ డెత్ (క‌స్టోడియ‌ల్ డెత్‌)ల త‌గ్గుద‌ల‌లో దేశంలోనే ఆంధ్ర ప్ర‌దేశ్ తొలి స్థానంలో నిలిచిందని, ఈ విష‌యాన్ని వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. లాక‌ప్ డెత్‌ల‌కు సంబంధించి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప‌రిస్థితిని వివ‌రిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జాబితాల‌ను సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు. ఈ జాబితాలో 2020-21 ఏడాదిలో ఏపీలో 50 లాక‌ప్ డెత్‌లు చోటుచేసుకోగా…2021-22కు అది 48కి త‌గ్గింది. అంటే ఏడాదిలోనే 2 లాకప్ డెత్‌లు త‌గ్గిన‌ట్లు లెక్క‌.

Vijay Sai Reddy prays Lord Venkateswara for people happiness

ఇలా ఇంకొన్ని రాష్ట్రాల్లోనూ లాక‌ప్ డెత్‌లు త‌గ్గినా… వాటి త‌గ్గుద‌ల శాతంలో మాత్రం ఏపీ మొద‌టి స్థానంలో నిలిచిందన్నారు విజ‌య‌సాయిరెడ్డి. మరిన్ని రాష్ట్రాల్లోనూ లాక‌ప్ డెత్‌లు త‌గ్గాయ‌ని పేర్కొన్నారు విజ‌య‌సాయిరెడ్డి. ఇది ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామ‌మ‌ని తెలిపారు. ఏపీ సీఎం జ‌గ‌న్ నాయ‌కత్వంలో లాకప్ డెత్‌ల‌ను మ‌రింత త‌గ్గించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్లడించారు విజ‌య‌సాయిరెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news