పురందేశ్వరి నేరానికి మద్దతిస్తారా? లేక చట్టానికి ఇస్తారా : విజయసాయిరెడ్డి

-

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సైతం ఉన్నారు. అయితే.. ఈ నేపథ్యంలో పురందేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. తాజాగా విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా మరోసారి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు నాలుగు ప్రశ్నలు సంధించారు.

‘పురంధేశ్వరి గారు! బాబు అవినీతికి శిక్షపడాలి. బాబు అవినీతికి ఆధారాలన్నీ చూపిస్తూ అరెస్టు జరిగింది. బాబు అవినీతిని రాష్ట్ర సీఐడీ, కేంద్ర ఈడీ, కేంద్ర ఐటీ నిర్ధారించాయి. మరి అలాంటప్పుడు బాబుకు మీ మద్దతు అంటే దాని అర్థం ఏమిటి? మీది నేరానికి మద్దతా… లేక చట్టానికి మద్దతా? చంద్రబాబుకు 17–ఏ సెక్షన్‌ వర్తిస్తుందని… ఆ సెక్షన్‌ ప్రకారం గవర్నర్‌ గారి అనుమతి తీసుకునే అరెస్టు చేయాలని టీడీపీ అధినేత లాయర్లు వాదిస్తున్నారు తప్ప, బాబు ఏ నేరం చేయలేదని… ఏ విచారణకైనా సిద్ధమని మాట వరసకు కూడా అనటం లేదు!

ఇలాంటి అవినీతి బాగోతంలో మీరంతా మీ కుటుంబంగా, బాబు జనతా పార్టీగా చంద్రబాబు వైపు నిలబడ్డారు! మరి ఈ అవినీతి బాగోతంలో తాము ఎటువైపు నిలబడాలన్నది భారతీయ జనతా పార్టీ తేల్చుకోవాలి! మరో విషయం కూడా… చంద్రబాబు అవినీతి గురించి, దుర్మార్గాల గురించి మీ భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో రాసిన ‘ఒక చరిత్ర కొన్ని నిజాలు’ అన్న పుస్తకాన్ని అమిత్‌ షా గారికి ఇచ్చారా? లేక ఆ పుస్తకం మీద, మీ ఆయన మీద కూడా మీరు, లోకేశ్‌ కలిసి అమిత్‌షా గారికి ఫిర్యాదు చేశారా? అన్నది కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేయండి!’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version