డైరెక్ట్ గా వస్తే తట్టుకోగలవా లోకేశం? : విజయసాయిరెడ్డి

-

ఈ రోజు పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ నిర్వ‌హించిన జూమ్ మీటింగ్‌లోకి వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ ఎంట‌రైన వ్య‌వ‌హారంపై టీడీపీ, వైసీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం సాగుతోంది. ఈ క్ర‌మంలో విద్యార్థుల ఐడీల‌తో త‌న జూమ్ మీటింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యేల‌పై విరుచుకుప‌డిన లోకేశ్… ద‌మ్ముంటే నేరుగా త‌న‌తో చ‌ర్చ‌కు రావాలంటూ స‌వాల్ చేసిన సంగ‌తి తెలిసిందే.

నారా లోకేశ్ సంధించిన ఈ స‌వాల్‌కు వైసీపీ ప్ర‌ధాన కార్య‌దర్శి, ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జూమ్ మీటింగ్‌లోకి వ‌స్తేనే మ్యూట్ చేసి పారిపోయావ్‌.. ఇక డైరెక్ట్‌గా వ‌స్తే త‌ట్టుకోగ‌ల‌రా? అంటూ ఆయ‌న లోకేశ్‌ను ప్ర‌శ్నించారు. నేరుగా ర‌మ్మ‌ని స‌వాల్ విసిరే స‌త్తా మీకెక్క‌డిదన్న రీతిలో సాయిరెడ్డి సెటైర్లు సంధించారు. చిన్న పిల్ల‌ల‌తో రాజ‌కీయం చేయ‌డం త‌గ‌దంటూ హిత‌వు ప‌లికారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version