కేటీఆర్ కు విజయశాంతి సవాల్..అసదుద్దీన్ ను అరెస్ట్ చేయండి !

-

కేటీఆర్ కు విజయశాంతి సవాల్ విసిరారు. హిందువులపై కామెంట్లు చేసిన అసదుద్దీన్ ను అరెస్ట్ చేయండని డిమాండ్ చేశారు. మతపరమైన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో నవీన్ జిందాల్, నూపుర్ శర్మలపై బీజేపీ అగ్రనాయకత్వంపై కఠిన చర్యలు తీసుకుంది. దేశంలో మత సామరస్యం దెబ్బతినకుండా తగిన నియంత్రణలు చేపట్టిందని తెలిపారు. అయినప్పటికీ టీఆరెస్ అగ్రనేత, మంత్రి అయిన కేటీఆర్ గారు బీజేపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. మరోవైపు టీఆరెస్ సయామీ కవల మతతత్వ పార్టీ అయిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా లైన్‌లోకి వచ్చి బీజేపీ నుంచి సస్పెండ్ అయిన నూపుర్ శర్మని అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారన్నారు.

సరే, ఈ నేతల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను… అసదుద్దీన్ సోదరుడు, ఎమ్మెల్యే అయిన అక్బరుద్దీన్ తన బహిరంగ సభల్లో నేరుగా శ్రీరాముడు, సీతామాత, సహా హిందూ దేవీదేవతలను పేర్లు పెట్టి మరీ ప్రస్తావించి విమర్శించి, పరిహసించిన వీడియోలు యూట్యూబ్‌లో ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయని గుర్తు చేశారు. గోమాతను సైతం అవమానించారు. మరి ఈయన విషయంలో కేటీఆర్, అసదుద్దీన్ అంతే కఠిన వైఖరిని ప్రదర్శించగలరా? ఈయన మాత్రమే కాదు, పలువురు హేతువాదులు, వామపక్షవాదులు, హైందవేతర మాతాలకు చెందిన మతవాదులు ఎందరో హిందూ దేవీదేవతలని, హిందు విశ్వాసాలు, ఆచార-సంప్రదాయాలను అవమానించి, విమర్శించిన వీడియోలు చాలా ఉన్నాయని వెల్లడించారు. మరోపక్క కేరళలో PFI సంస్థ హిందువులు, క్రిస్టియన్లను లక్ష్యంగా చేసుకుని విద్వేష ప్రచారం సాగిస్తోంది. వీరు తమ లక్ష్యానికి పిల్లల్ని కూడా వాడుకుంటున్నారు. వీరి విషయంలో కేటీఆర్, అసదుద్దీన్ స్పందన ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version