విక్రమ్ రివ్యూ: కమల్ హిట్ కొట్టాడు..బొమ్మ బ్లాక్ బాస్టర్..

-

చిత్రం : విక్రమ్

విడుదల తేదీ : జూన్ 3, 2022

నటీనటులు : కాళిదాస్ జయరామ్, నరైన్, ఆంథోనీ వర్గీస్ మరియు అర్జున్ దాస్‌లతో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ తదితరులు..

సంగీతం : దేవీశ్రీప్రసాద్

సినిమాటోగ్రఫీ : సాయిశ్రీరామ్

నిర్మాత : రాజ్ కమల్

కథ – స్ర్కీన్ ప్లే – దర్శకత్వం : లోకేష్ కనకరాజు

గత కొన్నెల్లుగా కమల్ ఖాతాలో హిట్ సినిమా పడలేదు..ఈ మేరకు కాస్త గ్యాప్ తీసుకొని వచ్చిన సినిమా విక్రమ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనకరాజు దైరెక్షన్ లో ఈ సినిమా వచ్చింది.ఈ సినిమా టాక్, కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాము..

కథ, విశ్లేషణ..

ఈ సినిమాలో కమల్ తో పాటు ఫహద్ ఫాజిల్ విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లాంటి నటులు కూడా సాలిడ్ రోల్స్ లో చేయడం వీటిని మించి ఇంకో ఇంట్రెస్టింగ్ అంశంగా స్టార్ హీరో సూర్య కూడా భాగం కావడంతో ఓ రేంజ్ లో హైప్ ఈ సినిమాపై నెలకొంది..నటులు అద్భుతంగా రాణించగా తన సినిమా “ఖైదీ” కి లింక్ చెయ్యడం కనిపించాయని అంటున్నారు. ఈ ఎక్స్ పీరియన్స్ లు చాలా కొత్తగా అనిపిస్తాయని సినిమా చూసిన వారు అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఒక లెవెల్లో ఉందని సినీ విష్లెషకులు అంటున్నారు.ఫస్టాఫ్ మొత్తం టెర్రిఫిక్ ఇంట్రో సీన్‌లతో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్‌తో యాక్షన్ ప్యాక్‌లా సాగిపోతుందట. మరీ ముఖ్యంగా విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, కమల్ క్యారెక్టర్లను చూపిన తీరు అదిరిపోతుందట. అయితే, సెకెండాఫ్ మాత్రం కొంత ల్యాగ్ ఉన్నట్లుగా అనిపిస్తుందని తెలిసింది. అయితే, క్లైమాక్స్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుందని పబ్లిక్ టాక్..ఫస్టాఫ్‌లో కమల్ హాసన్ పాత్ర చాలా తక్కువ సమయమే ఉంటుందట. ఒక సందర్భంలో అసలు ఇది కమల్ సినిమానేనా అని సందేహం వస్తుందట. అయితే, సెకెండాఫ్‌లో మాత్రం ఆ లోటును భర్తీ చేశారనే టాక్ వినిపిస్తోంది.ఎవరికీ వారే అన్నట్లు కథకు తగ్గట్లు నటించారు.. ఇప్పటివరకు అందుతున్న టాక్ ప్రకారం కమల్ కెరియర్ లో ది బెస్ట్ మూవీ అని చెబుతున్నారు..మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

రేటింగ్:4/5

Read more RELATED
Recommended to you

Exit mobile version