Vikram: రొమాలు నిక్క‌బొడిచేలా యూనివ‌ర్స‌ల్ యాక్ట‌ర్ బర్త్ డే ట్రీట్!

-

Vikram: తన నట విశ్వరూపంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరో కమల్‌ హాసన్‌. క‌మ‌ల్ హాస‌న్ న‌టుడిగానే కాకుండా.. దర్శకుడిగా, నిర్మాతగా, సింగర్‌గా, స్క్రీన్‌రైటర్‌గా, రచయితగా వెండి తెర పై మెరిశాడు. ఇటు బుల్లి తెర మీద కూడా హోస్ట్ గా ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తూ వ‌స్తున్నాడు. తాజాగా లోకేష్‌ కనగరాజ్‌ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం విక్ర‌మ్‌. ఈ చిత్రం ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సింది.. కానీ, ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌స్తుంది.

ఈ నేప‌థ్యంలో త‌న బర్త్ డే కానుక అభిమానుల‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేశాడు మ‌న‌ యూనివర్సల్‌ యాక్టర్‌. క‌మల్ హాస‌న్ నటిస్తున్న `విక్రమ్‌` చిత్రం నుంచి ఫస్ట్ గ్లాన్స్ విడుదల చేశారు. క‌మ‌ల్ బ‌ర్డ్ డే ట్రీట్ గా ఈ చిత్రం నుంచి ఫస్ట్ గ్లాన్స్ వైరల్ అవుతుంది. 48 సెకన్ల నిడివి గల ఈ వీడియో యూట్యూబ్ లో హ‌ల్ చేస్తుంది. నెట్టింట్లో దుమ్మురేపుతుంది.

యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఫ‌స్ట్ గ్లాన్స్ లో కమల్‌ ఎంట్రీ అదిరిపోయేలా ఉంది. ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌ హీరోగా నటిస్తుండగా, విజయ్‌ సేతుపతి, మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.

https://youtu.be/Uw17HJkrGR0

Read more RELATED
Recommended to you

Exit mobile version