టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు ఆయనకే అర్థం కావడం లేదని మండిపడ్డారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్. వచ్చే ఎన్నికలలో ఓడిపోతామనే భయం, నిరాశ నిస్పృహాలతో రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో కాషాయ పార్టీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ యువతను తప్పుదోవ పట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిఆర్ఎస్ అభివృద్ధి గురించి ఢిల్లీలో బిజెపి నేతలు గొప్పగా చెబుతారని .. కానీ రాష్ట్రంలోని బిజెపి నేతలకు ఇక్కడి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. కేంద్రం తెలంగాణకు ఎన్ని కోట్లు ఇచ్చిందో బిజెపి నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికలలో ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని సూచించారు.