బాబోయ్..జాలరికి చుక్కలు చూపించిన చేప..

-

పాములు పగ పడతాయని తెలుసు..కానీ, చేపలు కూడా పగ పడతాయా..అవునా..నిజమా..అవునండి.. ఓ చేప తనను వల వేసి పట్టాడని జాలరికి ముప్పు తిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్ళు తాగించింది. వలను పైకి తీసిన జాలరికి కనురెప్ప కాలంలో షాక్ ఎదురైంది.అలా తీసాడో..లేదో ఒకేసారి జాలరి గొంతులోకి జారింది.వామ్మో అదేలా సాధ్యం అనే సందేహాలు రావడం సహజం..దాని గురించి పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…

 

థాయ్‌లాండ్‌లో చేపల వేటకు వెళ్లిన ఒక వ్యక్తికి ఊహించని షాక్ ఇచ్చింది చెరువులోని చేప. చేప చేతికి చిక్కిద్దని భావిస్తే.. అది ఏకంగా అతని గొంతులోకి దూరింది.చెరువులో చేపల కోసం గాలం వేసి ఎదురుచూస్తూ ఉన్నాయి. ఇంతలో చేప గాలానికి చిక్కినట్లు అనిపిచంగా.. ఆ గాలాన్ని ఆబగా తీసేందుకు ప్రయత్నించాడు. అయితే, చేప గాలానికి చిక్కిందని సంతోషపడేలోపే.. అది ఊహించని షాక్ ఇచ్చింది. నీటిలోంచి ఎగిరిన చేప.. నేరుగా ఆ జాలరి నోట్లోకి వచ్చి పడింది. అలా అది గొంతులోకి జారుకుని.. అన్నవాహిక, శ్వాసనాళానికి మధ్యలో ఇరుక్కుపోయింది.

దాంతో అతను శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు..చాలా సేపు గిల గిల కొట్టుకున్నాడు.అనాబాస్ అనే స్పైకీ చేప గొంతులో చిక్కుకుందని గుర్తించారు. అయితే, చేప గొంతులో ఇరుక్కపోవడం వలన అతనికి తీవ్ర గాయమైంది. వైద్యులు చాలా కష్టపడి అతని గొంతులో ఇరుక్కున్న చేపను జాగ్రత్తగా బయటకు తీశారు..ఇలాంటి ఘటనలు ఇంతవరకూ మనం ఎక్కడా చూడలేదు.. అయితే చేప మాత్రం డాక్టర్ల చేతిలో చనిపొయింది..రివెంజ్ తీర్చుకుంది..అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version