గ్రాండ్​ ఈవెంట్​లో రణ్​వీర్​ను పట్టించుకోని దీపిక.. వీడియో వైరల్?

-

సెలబ్రిటీలు ఇంట్లో ఎలా ఉన్నా పబ్లిక్ ప్లేస్ లో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కెమెరా కంటితో క్లిక్ అవుతారు. నెటిజన్ల వద్ద బుక్ అవుతారు. తాజాగా అలాగే బుక్కయ్యారు బాలీవుడ్ పవర్ కపుల్ రణ్​వీర్ సింగ్​-దీపికా పదుకొణె. ఆన్​స్క్రీన్​తో పాటు ఆఫ్​స్క్రీన్​లోనూ సూపర్ రొమాంటిక్ గా ఉండే ఈ జంట తాజాగా ఎడముఖం పెడముఖంగా కెమెరా కంటికి చిక్కారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓగ్రాండ్ ఈవెంట్ కు దీపికా, రణ్ వీర్ కలిసి వెళ్లారు. ముందుగా కారు దిగిన రణ్ వీర్.. రెడ్ కార్పెట్​పై నడిచేందుకు దీపిక కోసం ఎదురు చూశాడు. దీపిక కారు దిగగానే.. తన చేయి చాచాడు. కానీ దాన్ని చూడనట్టుగానే దీపిక పదుకొణె ముందుకు అడుగులు వేస్తూ నడిచింది. దీంతో రణ్​వీర్​ సింగ్.. తన చేయిని కిందకు దించేసి ముందుకు సాగిపోయాడు. ముంబయి వేదికగా జరిగిన ఇండియన్ హానర్ స్పోర్ట్స్​ ఈవెంట్​లో పాల్గొనడానికి హాజరైంది ఈ జంట. అక్కడే ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

ఈ జంట బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఈ కార్యక్రమంలో పాల్గొనే ముందు ఇద్దరి మధ్య ఏదో చిన్న వాగ్వాదం జరిగిందేమో అన్నట్టుగా ఉందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. కొంతమంది దీపికకు మద్దతు పలుకుతూ.. ఆమె రణ్​వీర్​ చేయి చూడలేదని అంటున్నారు. ఇలా పలువురు నెటిజ‌న్స్ ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version