Viral News : హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌పై వెళ్లి పాల డెలివరీ

-

సోషల్ మీడియాలో చాలా వీడియోలు, ఫొటోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇక ఏదైనా ఇంట్రెస్టింగ్ వీడియో కనిపిస్తే చాలు.. అది మామూలుగా వైరల్ చేయరు నెటిజన్లు. అలా ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్న వీడియో ఒకటి నెటిజన్లు ఆకట్టుకుంటోంది. అదేంటంటే..?

తాజాగా పాలు అమ్మేందుకు ఓ వ్యక్తి ప్రీమియం బైక్‌ హార్లే డేవిడ్‌సన్‌ను ఉపయోగించడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా పాలు అమ్మేవాళ్లు.. ఏదో చిన్నపాటి ద్విచక్రవాహనాన్ని పాల క్యాన్లు తగిలించుకునేందు వీలుగా మార్చి.. ఇంటింటికీ వచ్చి పాలు పోసి వెళ్తుంటారు. కానీ, ఈ వ్యక్తి మాత్రం బైకు వెనక రెండు పాల క్యాన్లు పెట్టుకొని వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ, దీనికి సంబంధించిన వీడియోను అమిత్‌ బదనా అనే వ్యక్తి ఇన్‌స్టాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై రకరకాల కామెంట్లు వెల్లువెత్తున్నాయి. పాలు అమ్మడానికి హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌పై వెళ్లడంలో వింతేముంది అనుకుంటున్నారా? దీని విలువ రూ.11లక్షలకు పైగానే ఉంటుందండీ..!

Read more RELATED
Recommended to you

Exit mobile version