విరాట్ కోహ్లీ బ్యాక్ టు ఫామ్..మరో రికార్డు బ్రేక్

-

ఐపీఎల్ 2022 సీజన్ లో పేలావ బ్యాటింగ్ తో సతమతమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ తో గురువారం జరిగిన మ్యాచ్ లో విరాట్ 54 బంతుల్లో.. 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 73 పరుగుల విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ప్లే ఆప్స్ రేస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో స్వేచ్ఛగా ఆడిన విరాట్.. అభిమానులకు ఒకప్పటి తన ఆట రుచిని చూపించాడు. ఎలాంటి ఆందోళన లేకుండా చాలా కూల్ గా ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు.

అయితే అతని పేరిట రికార్డుల మోత కూడా మోగింది. ఈ ఇన్నింగ్స్ తో విరాట్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ప్రతి సీజన్లో వరుసగా 300కు పైగా పరుగులు చేసిన బ్యాటర్ గా విరాట్ నిలిచాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 14 మ్యాచుల్లో విరాట్ 309 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దాంతోనే విరాట్ ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఈక్రమంలో శిఖర్ ధావన్, సురేష్ రైనా పేరిట ఉన్న రికార్డులను బ్రేక్ చేశాడు. విరాట్ ఇప్పటి వరకు 13 సార్లు 300కు పైగా పరుగులు చేయగా.. సురేష్ రైనా, శిఖర్ ధావన్ 12 సార్లు ఈ ఘనతను అందుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version