‘విరాటపర్వం’ ట్రైలర్ రాబోతున్నది..ఆకట్టుకుంటున్న ‘నగాదారిలో’..

-

వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ‘విరాట పర్వం’ చిత్రం కోసం సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ నెల 17న చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ఫిల్మ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఇచ్చేశారు.

ఈ నెల 5న చిత్ర ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. 1990ల ప్రాంతంలో నక్సలైట్ల నేపథ్యంలో సినిమా స్టోరి ఉండబోతున్నది. రానా, సాయిపల్లవి మధ్య లవ్ స్టోరి చాలా కొత్తగా ఉండబోతున్నదని మేకర్స్ చెప్తున్నారు. సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ అందించిన ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ‘నగాదారిలో’ సాంగ్ జనాలను బాగా ఆకట్టుకుంటోంది.

‘విరాటపర్వం’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉండగా, అంచనాలను మించి పిక్చర్ ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో ఇటీవల విడుదలైన ‘ఆచార్య’ చిత్రం బాక్సాఫీసు వద్వ బోల్తా కొట్టింది. కానీ, ‘విరాట పర్వం’ మాత్రం జనాలకు బాగా నచ్చుతుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version