రాక్షస పాలన అంతమొందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలోకి : వివేక్‌ వెంకటస్వామి

-

తెలంగాణ బీజేపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. బీజేపీ సీనియర్‌ నేత గడ్డం వివేక్‌, ఆయన కుమారుడు వంశీ పార్టీకి రాజీనామా చేశారు. వీళ్లిద్దరూ రాహుల్‌ సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా ఉన్న జి.వివేక్‌…కొంతకాలంగా ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇవాళ ఉదయం ఆయనకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఫోన్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. ఇవాళ శంషాబాద్ నోవాటెల్ లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వివేక్ వెంకటస్వామికి, ఆయన కుమారుడు వంశీకృష్ణకు కండువావేసి పార్టీలోకి ఆహ్వానించారు.

అలనాడు తెలంగాణ కోసం కొట్లాడిన వివేక్ వెంకటస్వామిని పార్టీలో చేరాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆహ్వనించ చడంతో ఆయన పార్టీ మారారని తెలిసింది. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో నోవాటెల్ కు చేరుకున్న వివేక్ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ తో భేటీ అయ్యారు. అనంతరం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడడుతూ.. కాకా కుటుంబానికి గాంధీ ఫ్యామిలీతో మూడు తరాల అనుబంధం ఉన్నదన్నారు.

వివేక్ వెంకటస్వామి చేరిక తో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని చెప్పారు. తాను, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పలు మార్లు వివేక్ వెంకటస్వామిని కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించామని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ రాక్షస పాలన అంతమొందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి చెప్పారు. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో అప్పటి ఎంపీల పాత్ర ఎంతో కీలకమన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇచ్చిందని చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version