విశాఖపట్నం ఐటీ ఉద్యోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారనుంది : విజయసాయిరెడ్డి

-

విశాఖపట్నంను ఐటీహబ్‌గా మార్చబోతున్నట్లు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. మరికొన్ని రోజుల్లో విశాఖపట్నం ఐటీ ఉద్యోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారనుందని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో విశాఖలో 5 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని ప్రముఖ ఐటీ సంస్థ పల్సస్ గ్రూపు సర్వే నివేదికలో వెల్లడయ్యిందని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా సోమవారం పలు అంశాలపై స్పందించారు. విశాఖలో ఒక్క ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ విభాగంలోనే 50 వేల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని విజయసాయిరెడ్డి తెలిపారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 10 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పించే అవకాశం ఉందని ప్రముఖ ఐటీ సంస్థ పల్సస్ గ్రూపు సర్వే నివేదికలో వెల్లడించిందని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

అంతే కాక, తెలుగుదేశం పార్టీపై హాట్‌ కామెంట్స్‌ చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. వరుస ట్వీట్లతో విరుచుపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు అవినీతి కేసులో జైలుకు వెళ్లినా… ఆ పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోవడంలేదంటూ ట్వీట్‌ చేశారు విజయసాయిరెడ్డి. ఈ పరిస్థితి ఆ పార్టీలోకి దయనీయస్థితికి అద్దం పడుతోందని ఆరోపించారు. అంతేకాదు.. తెలుగుదేశం పార్టీ రెండు, మూడు ముక్కలుగా చీలిపోయేందుకు రెడీగా ఉందంటూ ట్వీట్‌ చేశారు విజయసాయిరెడ్డి. 40 సంవత్సరాలుగా టీడీపీకి మద్దతిస్తున్న బలమైన వ్యాపార వర్గంలో పునరాలోచన మొదలైందన్నారు. చంద్రబాబు దోపిడీలను తామెందుకు సమర్థించాలని ఆ వ్యాపార వర్గంలో ఆలోచన మొదలైందంటూ ట్వీట్‌ చేశారు విజయసాయిరెడ్డి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version