మ‌హాన‌గ‌రంలో వార్డుల పాల‌న పద్ధ‌తి పై కేటీఆర్ సమీక్ష

-

ప్రజలకు సత్వరమే, అత్యంత వేగంగా సేవలందించడమే కాదు, ప్రజా సమస్యలు, సలహాలు, సూచనలు తెలుసుకుని, వాటిని పరష్కరించేందుకు ప్రభుత్వం అద్భుత విధానానికి శ్రీకారం చుడుతోంది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీలో విప్లవాత్మక నిర్ణయంతో అధునాతన విధానాన్ని అమలులోకి తేవాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. హైదరాబాద్‌ మహానగర పరిధిలో త్వరలోనే వార్డు పరిపాలనా పద్ధతికి శ్రీకారం చుట్టనున్నామని, పాలనా వికేంద్రీకరణతో పౌరులకు అత్యంత వేగంగా పరిపాలనా ఫలాలు అందుతాయని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

జీహెచ్ఎంసీలో 150 వార్డుల్లో వార్డు కార్యాల‌యాలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. మే నెల‌ఖారున ఈ వార్డు కార్యాల‌యాలు ప్రారంభిస్తామ‌ని చెప్పారు. పాల‌న వికేంద్రీక‌ర‌ణ‌తో పౌరుల‌కు వేగంగా ప‌రిపాల‌న ఫ‌లాలు అందాలి. వార్డు కార్యాల‌యంలో 10 మంది అధికారులు అందుబాటులో ఉంటారు. అసిస్టెంట్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ స్థాయి అధికారి ఇంచార్జిగా ఉంటారు. స‌ర్కిల్, జోన‌ల్ ఆఫీసుల‌కు వెళ్ల‌కుండా వార్డు కార్యాల‌యంలోనే సేవ‌లు అందేలా చ‌ర్య‌లు తీసుకుంటాం. సిటిజ‌న్ ఫ్రెండ్లీగా జీహెచ్ఎంసీ వార్డు కార్యాల‌యాలు ఉండాలి. ప్ర‌తి వార్డు ఇంకో వార్డు కార్యాల‌యంతో అనుసంధానం కావాల‌ని కేటీఆర్ సూచించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version