మూసీనదికి నీటి ప్రవాహం కొనసాగుతోంది. 645అడుగుల (4.46టీఎంసీ) పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం ఉన్న
ప్రాజెక్టు నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 644.40అడుగులకు(4.30టీఎంసీ) చేరిందని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో వర్షాలతో వరద మూసీకి వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టానికి చేరుతుండడం, ఎగువ నుంచి ఇన్‌ఫ్లో నిలకడగా కొనసాగుతుండటంతో సోమవారం ఉదయం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉంది.
నీటి విడుదల విషయమై ప్రాజెక్టు అధికారులు ఇప్పటికే ఆయకట్టు ప్రజలు, రైతులను అప్రమత్తం చేశారు అధికారులు. జూలై 10 వరకు పత్తి సాగుకు అవకాశం10శాతం వర్షపాతం లోటునల్లగొండ, జూన్ 26 : జిల్లాలో ప్రస్తుత నెలలో ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడంతో పత్తి సాగు కేవలం 20శాతం మాత్రమే అయింది. అం దులో కూడా ఎండు దుక్కులో విత్తింది 10శాతం కాగా, వర్షం కురిశాక విత్తింది 10శాతం. అయితే విత్తనాలు చాలా ప్రాంతాల్లో మొలకెత్తలేదు.