నేడు బీఆర్‌ఎస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశమంతా దళితబంధు ఇవ్వాలి.. ఇదే బీఆర్‌ఎస్ డిమాండ్ అన్నారు. ‘లాభం ఉన్నకాడి నుంచి పేదలకు ఆదుకోవడం అనేది అనాదిగా భారతదేశ రక్తంలో ఉన్న సంప్రదాయం. ధనవంతులు ధర్మశాలలు కట్టిచ్చుడు మన సంప్రదాయం. పేదలను షావుకార్లకు అప్పజెప్పి సావగొడుతావా? దళితులు ఎవరి కోసం వివక్ష అనుభవించాలి? అందుకే పుట్టింది దళితబంధు పథకం. అంబేద్కర్, కాన్షీరాం బాటలో దళిత జాతి పైకి వచ్చి తీరాలి. తెలంగాణ దళితబంధు పథకాన్ని సంవత్సరానికి 25లక్షల కుటుంబాల చొప్పున భారతదేశమంతా అమలు చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తుంది. మీరు చేయకపోతే మేం చేసి చూపిస్తాం. మహిళలను అన్నిరంగాల్లోకి ఆహ్వానించారో.. ఆ దేశాలు బాగుపడ్డాయి. మన దగ్గర ఎంత తెలివి ఉన్నా.. వంటింట్లోనే ఉండాలి? మేం
బలాదూర్‌గా తిరుగుతాం అన్నట్లుగా ఉంది. ఈ లింగ వివక్ష పోవాలి. మహిళల పాత్రను అన్నిరంగాల్లో పెంపొందించాలి. ఇందులో
భాగంగా మహిళలకు 35శాతం చట్టసభల్లో రిజర్వేషన్లు ప్రతిపాదిస్తుంది’ అన్నారు.
‘దేశంలో మతపిచ్చి లేపుతున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్ముతున్నాడని, మళ్లీ పబ్లిక్ సెక్టార్‌లో పెడుతామన్నారు. వ్యవసాయాన్ని సైతం ప్రైవేటీకరణ చేసి మనం భూముల్లో జీతాలకు ఉండే పరిస్థితి ఉండే కుట్ర జరుగుతుంది. జ్ఞానం లేకపోతే.. ఎక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకోవాలి. ప్రపంచదేశాల నుంచి జ్ఞానాన్ని తీసుకోవాలి. చైనా, సింగపూర్ తదితర దేశాలతో ముందుకువెళ్లాలని కోరుకుంటున్నాం.. అగ్నిపథ్‌ను కూడా రద్దు చేస్తాం. సైన్యంలో జరిగే నియామకాలు పద్ధతి ఉండాలి. సైన్యానికో సిస్టమ్ ఉండాలి. రేపు విపక్షాల ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తుంది. పాత పద్ధతిలోనే కొనసాగిస్తాం. ఏ రకంగా ప్రతిపక్షాలను వేధిస్తున్నారో.. తమ అసమర్థతను, చేతగాని తననాన్ని కప్పిపుచ్చుకునేందుకు మత విద్వేషపు మంటలు రేపుతున్నారు.