ఏపీలో విపక్షాలు ఏకతాటిపైకి వచ్చేలా ఉన్నాయి..ఇప్పటికే కొన్ని అంశాల్లో ప్రతిపక్షాలు కలిసే, అధికార పక్షంపై పోరాడుతున్నాయి. అయితే ప్రజా సమస్యలపై సహకరించుకుంటున్నాయి తప్ప..రాజకీయంగా సహకరించుకునే పరిస్తితిలేదు..కానీ జగన్ మాత్రం..ప్రతిపక్షాలు మొత్తం ఒక్కటే అన్నట్లు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు చెప్పినట్లుగానే..పవన్ కల్యాణ్, కమ్యూనిస్టులు పనిచేస్తున్నారని జగన్ మాట్లాడుతున్నారు.
అసలు పవన్..చంద్రబాబు దత్తపుత్రుడు అని కామెంట్ చేశారు..ఇటీవల ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమాన్ని టీడీపీ-జనసేన-కమ్యూనిస్టులు కలిపి నడిపాయని ఆరోపించారు…అలాగే సమ్మె లేదనే సరికి బాధపడుతున్నారని అన్నారు. అయితే రాజకీయ పార్టీలు చెబితే ఉద్యోగులు సమ్మె చేసే స్టేజ్‌లో లేరని చెప్పొచ్చు…అంత అమాయకులు కూడా ఎవరు లేరు..కేవలం ఉద్యోగులు తమ జీతాలు తగ్గుతున్నాయని చెప్పి పోరాటం చేశారు….అలాగే ప్రభుత్వం ఏదో సర్ది చెబితే సమ్మె విరమించుకున్నారు.
అలా అని చెప్పి సమ్మె చేయించాలని ప్రతిపక్షాలు ఏమి కాచుకుని కూర్చోలేదు…సమ్మె చేస్తే వారికి మద్ధతుగా ఉండాలని మాత్రం అనుకున్నాయి.
అయితే జగన్ అనూహ్యంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. అయితే జగన్ ఇలా విమర్శలు చేయడం వల్ల ఇంకా ప్రతిపక్షాలని కలుపుతున్నట్లు ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లు ఒక్కటే అని పదే పదే విమర్శిస్తూ…వారిని ఏకం చేసేలా ఉన్నారు. ప్రస్తుతానికి రాజకీయంగా వారు విడివిడిగానే ముందుకెళుతున్నారు. అసలు వారు గాని కలిస్తే రాజకీయంగా జగన్‌కే ఇబ్బంది. ఆ విషయంలో క్లియర్‌గా అర్ధమవుతుందని చెప్పొచ్చు.
ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీ-జనసేనలు విడిగా పోటీ చేయడం వల్లే…ఎక్కువ సీట్లలో వైసీపీ గెలిచింది…ఎక్కువ నియోజకవర్గాల్లో జనసేన ఓట్లు చీల్చి వైసీపీ గెలుపుకు ఉపయోగపడింది…అదే అప్పుడు టీడీపీ-జనసేనలు కలిసి ఉంటే వైసీపీకి ఇన్ని సీట్లు కూడా వచ్చేవి కాదని తెలుగు తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు జగన్ మాత్రం చంద్రబాబు-పవన్ ఒక్కటే అన్నట్లు మాట్లాడుతున్నారు…నిజంగానే జగన్ అన్నట్లు..చంద్రబాబు-పవన్‌లు కలిస్తే మాత్రం నెక్స్ట్ వైసీపీకి చెక్ పడిపోవడం గ్యారెంటీ అని విశ్లేషకులు అంటున్నారు. జగనే అనవసరంగా బాబు-పవన్‌లని కలుపుతున్నట్లు ఉందని అంటున్నారు.