టమోటాతో పాటు సహచర పంటగా ఏం వేయొచ్చు..?

-

సాధారణంగా ఒకటే పంట వేస్తే పెద్ద లాభాలు ఉండవు. ఆ పంటకు ధర సరిగ్గా లేకపోతే నష్టపోవాల్సిందే. చాలామంది రైతులు సహచర పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. పొలం గట్ల వెంబడి కంది మొక్కలు వేస్తుంటారు. అయితే సహచర పంటల విషయంలో కాస్త అవగాహన ఉండాలి. ఏ పంటకు ఏది జత చేస్తే బాగుంటుంది, ఏది వేయకూడదు ఇలా..! ఈ క్రమంలో టమోటాతో పాటు సహచర పంటగా ఏవి వేయాలో ఇప్పుడు చూద్దాం.!
టమాటాలతో పాటు పెంచగలిగే సహచర మొక్కలు 
టమాటాలతో పాటు కొన్ని రకాల మొక్కలను నాటితే అవి టమాటా మొక్కలను సంరక్షిస్తాయి. టమాటా మొక్కలు చక్కగా ఎదిగేందుకు అవసరమయ్యే వాతావరణాన్ని అందిస్తాయి. తులసి, టమాటా మంచి స్నేహితులు. ఈ మొక్క మంచి సువాసనను అందిస్తుంది. అలాగే కీటకాలను, ముఖ్యంగా ఈగలను, హార్న్ వార్మ్స్‌ను తరిమికొడతాయి.
వెల్లుల్లి సాలీడు పురుగులను దగ్గరికి రాకుండా చూస్తుంది. వెల్లుల్లి నుంచి తయారు చేసే స్ప్రే మట్టిని సారవంతం చేస్తుంది. అలాగే మొక్కలకు ముడతలు రాకుండా రక్షిస్తుంది. పచ్చిమిర్చి కూడా టమోటాతో పాటు పెంచుకోవచ్చు.
పాట్ బంతి పువ్వులు టమాటాలకు మేలుచేసే వాటిలో ముందుంటాయి. నాస్టూర్టియం మిరియాలు, చేదు నూనెలు సాధారణ తెగులు నిరోధకంగా పని చేస్తాయి. అలాగే బంతి పువ్వులు రూట్ నాట్ నెమటోడ్ లను తరిమివేస్తాయి.
బోరేజ్ మొక్క పుష్పాలు నీలి రంగులో ఉంటాయి. నక్షత్ర ఆకారంలో చూడగానే ఆకట్టుకునేలా కనిపిస్తాయి. ఇవి టమాటా హార్న్ వార్మ్ లను చక్కగా నిరోధిస్తాయి.
కొత్తమీర వంటి ఆకులతో ఉంటుంది పార్స్లీ. ఇందులో ఎన్నో మంచి పోషకాలు ఉన్నాయి.. టమాటాలతో పాటు సహచర మొక్కగా దీనిని నాటవచ్చు. పార్స్లీ, పుదీనా మొక్కలు నాటడం వల్ల టమాటాలకు సోకే హార్న్ వార్మ్ లను ఇవి నిరోధిస్తాయి. అలాగే మొక్క ఎదుగుదలకు సహాయం చేస్తాయి.
వీటిల్లో ఏదో ఒకటి మీ నేలకు తగ్గట్టుగా చూసుకుని టమోటా పంటతో సహచర పంటగా వేయొచ్చు. ఎప్పుడైనా సహచర పంట ప్రధాన పంటకు మేలు చేసేదిగా ఉండాలి. దాని వల్ల ఎదుగల పెరిగేదిగా ఉంటేనే లాభం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version