దేశంలో వ్యవస్థలన్నీ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. వ్యక్తిగత / షరియా చట్ట ప్రకారం కాదు. ఇంట్లో ఉంటే నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు.ఏదయినా సంస్థలో డ్రెస్ కోడ్ అమల్లో ఉంటే తప్పక పాటించాల్సిందే అని అన్నారాయన. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ఆరంభం అయిన హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విద్యార్థులను రెండు వర్గాలుగా విడదీసి మరీ! చూపిస్తోంది.ముఖ్యంగా వివాదంలోకి అల్లరి మూకల ప్రవేశం కారణంగా సమస్య నానాటికీ తీవ్ర రూపం అందుకుంటోంది. ఈ నేపథ్యంలో బీజేపీ సంబంధిత వర్గాలు అన్నీ దీన్నొక రాజకీయ ప్రతివాద చర్యగానే పరిగణిస్తున్నాయి.ఇందుకు యోగీ ఆదిత్య నాథ్ కూడా మినహాయింపు కాదు అని నిన్నటి వేళ ఓ ప్రముఖ మీడియాతో చెప్పిన మాటలే నిర్థారణ చేస్తున్నాయి.