హోమ్​లోన్​ ప్రొవిజినల్​ సర్టిఫికేట్ అంటే ఏమిటి..? ఎలా పొందొచ్చు..?

-

చాలా మంది సొంతింటి కలని సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే తగినన్ని డబ్బులు లేవా..? లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే తప్పక మీరు ఈ విషయాలని తెలుసుకోవాలి. ముఖ్యంగా హోమ్​లోన్​పై లభించే ట్యాక్స్ మినహాయింపు ప్రయోజనాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. అలానే ఏమేం డాక్యుమెంట్స్ కావాలో కూడా తెలియాలి. అయితే వీటిలో ప్రొవిజినల్ సర్టిఫికేట్ ముఖ్యమైంది.

homeloan/హోమ్​లోన్

బ్యాంకుకు చెల్లించిన అసలు, వడ్డీపై లభించే ట్యాక్స్ మినహాయింపులకు ప్రూఫ్​గా ఇది పనిచేస్తుంది. ఇక దీని కోసం పూర్తిగా చూస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మీరు బ్యాంకుకు చెల్లించిన అసలు, వడ్డీల స్టేట్​మెంట్​గా ఈ ప్రొవిజినల్​ సర్టిఫికేట్ అనేది పని చేస్తుంది. హోమ్ ​లోన్​ తీసుకున్న బ్యాంకు నుంచి ఈ సర్టిఫికేట్​ను పొందాల్సి ఉంటుంది. అయితే దీని వలన ఉపయోగాలని గురించి చూస్తే.. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 80 సి ప్రకారం.. హోమ్​ లోన్ కింద చెల్లించిన అసలు​పై రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. అదే విధంగా సెక్షన్ 24 (బి) ప్రకారం.. మీరు చెల్లించే వడ్డీపై రూ.2 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు.

ఇది ఇలా ఉంటే కరోనా కారణంగా ఆర్​బీఐ మారటోరియం వెసులుబాటును కల్పించింది. దీనిని సెలెక్ట్ చేస్తే ఈఎంఐలను సకాలంలో చెల్లించనందున, వారికి పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా తక్కువగా ఉంటాయి. ఇక దీనిని ఎలా పొందొచ్చు అనేది చూస్తే.. ఆన్​లైన్​లోనూ ప్రొవిజినల్​ సర్టిఫికేట్ పొందవచ్చు. ప్రస్తుతం, ఎక్కువ బ్యాంకులు తమ వినియోగదారులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

దీని కోసం మీరు నెట్ బ్యాంకింగ్ ఖాతా ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. అక్కడ హోమ్​లోన్​ అకౌంట్​ నంబర్​, పుట్టిన తేదీ, లోన్​ మొత్తం, EMI మొత్తాలను ఎంటర్​ చేయండి. అక్కడ గృహ రుణానికి సంబంధించిన ప్రొవిజినల్​ సర్టిఫికెట్ ఉంటుంది. లేదు అంటే సమీపంలోని బ్యాంక్ శాఖను సందర్శించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version