మాట ఇస్తున్న బాబు..జనం భయపడుతున్నారా?

-

రాజకీయాల్లో ఏ నాయకుడైన జనాలకు ఒక హామీ ఇస్తే…ఆ హామీని ఖచ్చితంగా నెరవేర్చాలి. కానీ ఆ హామీ నెరవేర్చకుండా మాట తప్పితే మాత్రం…జనం, ఆ నాయకుడుని ఇంకా ఎక్కువగా నమ్మరు. ఇప్పుడు ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుది కూడా అదే పరిస్తితి అయింది. ఎందుకంటే మాట ఇచ్చి…మాట తప్పడంలో బాబుని మించిన వారు లేరనే చెప్పాలి. ఆయన ఎన్నిసార్లు మాట ఇచ్చి…మాట తప్పారో జనాలకు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు బాబు ఏమన్నా మాట ఇస్తే…జనం భయపడే పరిస్తితి వచ్చింది.

chandrababuఇటీవల ఏపీలో జగన్ ప్రభుత్వం ఓటీఎస్ పేరిట…ఎప్పుడో 1983 నుంచి 2018 వరకు ఆయా ప్రభుత్వాల హయాంలో..ప్రభుత్వ పథకాల కింద కట్టుకున్న ఇళ్లకు పూర్తి హక్కులు కల్పిస్తామని చెప్పి లబ్దిదారుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం మొదలుపెట్టింది. గ్రామాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.20 వేలు కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అసలు ఎప్పుడో కట్టుకున్న తమ ఇళ్లకు ఇప్పుడు డబ్బులు కట్టడం ఏంటని జనం ఎదురు తిరిగే పరిస్తితి వచ్చింది. అసలే ఇబ్బందుల్లో ఉన్న తాము ఈ డబ్బులని కట్టలేమని పేద ప్రజలు అంటున్నారు.

ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేత చంద్రబాబు…ప్రజలకు ఒక హామీ ఇస్తున్నారు. ఎవరూ ఓటీఎస్ కింద డబ్బులు కట్టవద్దని, నెక్స్ట్ వచ్చేది టీడీపీ ప్రభుత్వమని, అప్పుడు ఉచితంగా ఇళ్లని రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని చెబుతున్నారు. సరే బాబు చెప్పేది మంచి మాటే.

కానీ ఆ మాటకే ప్రజలు భయపడే పరిస్తితి ఉంది. ఎందుకంటే 2014 ఎన్నికల ముందు రైతుల, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి, వారిని బ్యాంకులకు డబ్బులు కట్టొద్దని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక డ్వాక్రా రుణమాఫీ గాలిలో కలిపేశారు. ఇక రైతులకు మొక్కుబడిగా కొంతవరకే రుణమాఫీ చేశారు. మిగిలిన రైతులు పెరిగిన వడ్డీలనే బ్యాంకులకు కట్టలేక నానా ఇబ్బందులు పడ్డారు. అలాంటిది ఇప్పుడు ఓటీఎస్ డబ్బులు కట్టొద్దని మాట ఇస్తుంటే జనం భయపడే పరిస్తితి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news