పదో తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత విద్యార్థులు సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. ఒకపక్క సెలవులను ఎంజాయ్ చేస్తూనే మరో పక్క ఫలితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు .ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ SSC బోర్డు నుండి కీలక ప్రకటన వచ్చింది. ఈ నెలాఖరికల్లా పదో తరగతి ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 25న రిజల్ట్స్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు.
అయితే, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఫలితాల విడుదల కోసం ఈసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అని,ఒకవేళ అనుమతులు రావటం ఆలస్యం అయితే, నెలాఖరుకల్లా ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించారు అధికారులు. గత ఏడాది మే 6న ఫలితాలు విడుదల చేశామని, ఈ ఏడాది అంతకంటే ముందే విడుదల చేస్తామని తెలిపారు. మార్చి 18 నుండి 30వరకూ జరిగిన ssc పరీక్షలకు 6లక్షల 30వేల 633మంది విద్యార్థులు హాజరు అయినారు.