తెలంగాణ రాజకీయాల్లో హుజురాబాద్ ఉపఎన్నిక ఎంత ఆసక్తికరంగా మారిందో అందరికీ తెలిసిందే. హుజురాబాద్ నియోజకవర్గాన్ని దక్కించుకోవడానికి అన్ని పార్టీలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అభ్యర్థులుగా ఎవరు నిలబెడుతున్నారనే విషయంలో ఒక స్పష్టత వచ్చేసింది. ఐతే తాజాగా హుజురాబాద్ ఉపఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ విషయమై అటు కేసీఆర్ పై, అటు టీఆర్ఎస్ ప్రభుత్వంపై రకరకాల విమర్శలు చేస్తున్నారు.
కేసీఆర్ ఢిల్లీ వెళ్ళడం వల్లే ఉపఎన్నికలు వాయిదా పడ్డాయని, ప్రధానితో సమావేశం జరిగిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని, ఉపఎన్నికలు వాయిదాప్ పడడానికి రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవని, కోవిడ్ ని కారణంగా చెబుతున్నారని, అదే నిజమైతే స్కూళ్ళు, ఆఫీసులు, సినిమా హాళ్ళు ఎందుకు తెరిచారని, అదీగాక ఇంకా పాదయాత్రలకు ఎందుకు పర్మిషన్ ఇచ్చారని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉపఎన్నిక మరింత రసవత్తరంగా మారుతుందని అర్థం అవుతుంది.